అనురాగ పూర్ణుడా / Anuraagaapoornuda Song Lyrics
Telugu Latest Christian Songs Lyrics 2024
Song Credits:
Hosanna Ministries 2024
Lyrics:
పల్లవి :
నీకేగా నాస్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదికనీ ప్రేమ నాపై చల్లారి పోదు
మరణా నికైనా వెనుదిరగలేదు
మనలేను నే నిన్ను చూడకా
మహా ఘనుడా నా యేసయ్యా ||నీకేగా నాస్తుతి||
చరణం 1 :
సంతోసగానాల స్తోత్రసంపదనీకే చెల్లింతును ఎల్ల వేళలా
[ అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
నీ గుణాశీలతా వర్ణింపతరమా ]|2||
నా ప్రేమ ప్రపంచము నీకేనయ్యా
నీవు లేని లోకాన నేనుండలేనయ్య
[ నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్య ]|2||నీకేగా నాస్తుతి||
చరణం 2 :
నీతో సమమైన బలమైన వారెవ్వరూవేరే జగమందు నే నేందు వెదకినను
[ నీతి భాస్కరుడా నీ నీతి కిరాణం
ఈ లోకమంతా ఈ లోకమంతా ఏలుచున్నాదిగా ]|2||
నా మదిలోనా మహారాజు నీవేనయ్య
ఇహ పరమందు నాన్నేలు తేజోమయ్యా
[ నీ నామం కీర్తించి ఆరాదింతును ]|2||నీకేగా నాస్తుతి||
చరణం 3 :
నీతో నిలుచుండు ఈభాగ్యమే చాలువేరే ఆశేమియు లేదు నాకిలలో
[ నా ప్రాణ ప్రియుడా నాన్నేలు దైవమా
ఆ పాదామస్తకం నీకేగా అంకితం ]|2||
నా శ్వాస నిశ్వాసము నీవెనయ్యా
నా జీవిత ఆధ్యాంతంనీవేనయ్యా
[ నీ కొరకే నేనిలలో జీవింతును ]|2||నీకేగా నాస్తుతి||
FULL VIDEO SONG
Search more songs like this one
0 Comments