KALLU THERUCHUKO / కళ్ళు తెరుచుకో Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs2024
Song Credits:
Lyrics:
పల్లవి :
[ కళ్ళు తెరచుకో - ఈ నిజం తెలుసుకో ]|2|
[ నీ గర్వాన్ని విడిచి కరుణించమని దేవుని వేడుకో ]|2|
నీకు నీవుగా చేసే నీ సొంత ప్రయత్నాలు
దేవుని కృప లేకుండా సఫలము కానేకావు ||కళ్ళు తెరచుకో||
చరణం 1 :
[ నీ దగ్గర ధనముంటే మందులు కొనగలవేమోగాని
ఆయుష్కాలము పొడిగించుకొనుట సాధ్యంకాని పని ]|2|
[ ఆరోగ్యము దేవునివశము - యేసే క్షేమాధారము ]|2|
నీకు నీవుగా చేసే నీ సొంత ప్రయత్నాలు
దేవుని కృప లేకుండా సఫలము కానేకావు ||కళ్ళు తెరచుకో||
చరణం 2 :
[ నీ దగ్గర ధనముంటే పరుపులు కొనగలవేమోగాని
సరియగు నిద్రను రప్పించుకొనుట సాధ్యం కాని పని ]|2|
[ విశ్రామము దేవునివశము - యేసే ప్రాణాధారము ]|2|
నీకు నీవుగా చేసే నీ సొంత ప్రయత్నాలు
దేవుని కృప లేకుండా సఫలము కానేకావు ||కళ్ళు తెరచుకో||
చరణం 3 :
[ నీ దగ్గర ధనముంటే మనుష్యుల కొనగలవేమో గాని
అనుబంధాలను నిలబెట్టుకొనుట సాధ్యం కాని పని ]|2|
[ ఆత్మీయత దేవునివశము - యేసే ప్రేమాధారము ]|2|
నీకు నీవుగా చేసే నీ సొంత ప్రయత్నాలు
దేవుని కృప లేకుండా సఫలము కానేకావు ||కళ్ళు తెరచుకో||
0 Comments