కన్నులెత్తుచున్నాను / Kannuletthuchunnanu Song Lyrics
Telugu Christian Songs Lyrics 2024
Song Credits:
Hosanna Ministries
Lyrics:
ఆ..ఆ..ఆ.....
స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం యేసయ్య..(2)
ఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను..
నా సహాయకుడు నీవే.. యేసయ్య..
...(.music)
పల్లవి :
ఆకాశం వైపు నా కన్నులెత్తి చున్నాను..
నా సహాయకుడు నీవే యేసయ్యా..(2)
కలవరము నొందను నిను నమ్మి యున్నాను(2)
కలత నేను చెందను కన్నీరు విడువను(2)..(ఆకాశం వైపు)
చరణం 1 :
ఆకాశం పై నీ సింహాసనం ఉన్నది..రాజ దండముతో నన్నేలు చున్నది..(2)..
నీతిమంతునిగా చేసి..
నిత్యజీవం అనుగ్రహించితివి..(2)
నేనేమైయున్నానో అది నీ కృప ఏ కదా..(2)(ఆకాశం వైపు)
చరణం 2 :
ఆకాశము నుండి నాతో మాట్లాడుచున్నావు..ఆలోచన చేత నన్ను నడిపించు చున్నావు..(2)
నీ మహిమతో నన్ను నింపి..
నీ దరికి నన్ను చేర్చితివి..(2)
నీవుండగా ఈ లోకంలో..
ఏదియు నాకు అక్కర లేనే లేదయ్యా..(2) ("ఆకాశం")...
చరణం 3:
ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి ఉన్నది..అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది..2
నా హృదయము నీ మందిరమై..
తేజస్సుతో నింపితివి..(2)
కృపాసనముగా నను మార్చి..
నాలో నిరంతరము నివసించితివి..(2)"(ఆకాశం)"
చరణం 4 :
ఆకాశము నీ మహిమను వివరించు చున్నది ..అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించు చున్నది..(2)
భాష లేని మాటలేని స్వరమే వినబడినవి..
పగలు బోధించుచున్నవి..
రాత్రి జ్ఞానం ఇచ్చుచున్నవి..(2)
చరణం 5 :
క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి,నూతనయేరుషలేము నాకై నిర్మించు చున్నావు.. మేఘ రధముల పై అరుదించి నన్ను కొనిపోవా..(2)
ఆశతో వేచి ఉంటిని..
త్వరగా దిగి రమ్మయ్య..(2)(ఆకాశం)..
0 Comments