Nuthanamaina Krupa/ నూతనమైన కృప Song Lyrics
Latest Telugu Christian Song Lyrics 2024
Song Credits:
Hosanna Ministries
2024 New Album Song-1
Pas.JOHN WESLEY Anna
2024 New Album Song-1
Pas.JOHN WESLEY Anna
Lyrics:
పల్లవి :
నూతనమైన కృప - నవ నూతనమైన కృపశాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప
నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్యా
నీవాత్సల్యమే నాపై చూపించిన
నీప్రేమను వివరించనా!
నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా....
ఇదేకదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం||2||నూతనమైన కృప||
చరణం 1 :
[ నాక్రయధనముకై రుధిరము కాంతివిఫలవంతములైన తోటగా మార్చితివి ]|2||
ఫలితముకొరకైన శోధన కలిగినను
ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి
ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
అన్నివేళలయందు ఆశ్రయమైనావు
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం|||నూతనమైన కృప||
చరణం 2 :
[ నీ వశమైయున్న ప్రాణాత్మదేహమునుపరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను ]|2||
పలువేదనలలో నీతో నడిపించి
తలవంచని తెగువ నీలో కలిగించి
మదిలో నిలిచావు - మమతను పంచావు
నా జీవితమంతా నిను కొనియాడెదను
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం|||నూతనమైన కృప||
చరణం 3 :
[ సాక్షి సమూహము మేఘమువలెనుండినాలో కోరిన ఆశలు నెరవేరగా ]|2||
వేలాది దూతల ఆనందముచూచి
కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ
మహిమలో నీతోనే నిలిచిన వేళ
మాధుర్య లోకాన నిను చూచిన వేళ
ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా
ఇదేకదా నీలో పరవశం
మరువలేని తియ్యని జ్ఞాపకం|||నూతనమైన కృప||
FULL VIDEO SONG
0 Comments