Ontarinan / ఒంటరినని Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2024
Song Credits:
Vocal: sis.Sharon
Music:Bro.Y.SunilKumar
Video mixing:bro.Prasanna
Recording at: Sunil Music Studio(KKD)
Lyrics:
పల్లవి :
[ ఒంటరినని ఏడ్చుచుంటివా
ఓదార్చేవారు లేక కృంగియుంటివా ] (2)
[ నిను పిలిచినవాడు నమ్మదగినవాడు
ఏ స్థితిలోనైనా నీ చేయి విడువడు ] (2)
[ ఇమ్మానుయేలులా నీకు తోడుండువాడు ](2)(ఒంటరినని)
చరణం 1 :
[ తలిదండ్రులే యాకోబును పంపివేయుచున్నా
కష్టములో తోడెవరూ తనతో రాకున్నా ] (2)
[ ఆపదలో ఆధారమైనాడుగా
భయపడకని బేతేలులో అన్నాడుగా ](2)
[ స్వాస్థ్యమునిచ్చి తన సొత్తుగ చేసి ](2)
[ ఓదార్చిన దేవుడు నిన్ను ఓదార్చును](2)( ఒంటరినని)
చరణం 2 :
[ శారాయే హాగరును గెంటివేయుచున్నా
తన తనయునికి ధనము ఏమివ్వకున్నా] (2)
[ ఆపదలో ఆధారమైనాడుగా
భయపడకని హాగరుతో అన్నాడుగా ](2)
[నీటి ఊటను చూపి దాహము తీర్చి] (2)
[ ఓదార్చిన దేవుడు నిన్ను ఓదార్చును ](2)(ఒంటరినని)
చరణం 3 :
[ తండ్రి ఇంట యోఫ్తాకు స్వాస్థ్యము లేదన్నా
పగబట్టి జనులంతా - తోలివేసియున్నా] (2)
[ ఆపదలో ఆధారమైనాడుగా
భయపడకని మిస్సాలో అన్నాడుగా ](2)
[ విజయము నిచ్చి అధికారిగా చేసి ](2)
[ ఓదార్చిన దేవుడు నిన్ను ఓదార్చును ](2) (ఒంటరిని)
FULL VIDEO SONG
Search more songs like this one
0 Comments