రాజాధిరాజు యేసుడు,Raajaadhi Raaju Yesudu Song Lyrics
Telugu Christian Song Lyrics 2024
Song Credits:
Atmarakshana Ministries
Lyrics:
పల్లవి :
[ రాజాధిరాజు యేసుడు - దేవాది దేవుడు క్రీస్తుడు
త్వరలో రానైయున్నాడు - కొని పోవనున్నాడు ]|2 ||
[ కీర్తించుడి కొనియాడుడి - స్తోత్రించుడి సన్నుతించుడి]|2 ||
సంతసించి ప్రభుని చెంత చేరి కొల్వుడి ||2 || రాజాధిరాజు యేసుడు||
చరణం 1 :
[ ప్రధానదూత శబ్దముతో - వేలాది దూతల సమూహముతో ]|2||
[ ఆర్భాటముతో మహ మహిమతో రానైయున్నాడు ]|2||
[ విడువబడక మునుపే మీరు రక్షణ పొంది ప్రార్థించుడి ]||2||॥ రాజాధిరాజు యేసుడు॥
చరణం 2 :
[ కొదమ సింహపు రీతిగాను - ప్రళయాగ్నివంటి గర్జనతోనూ ]2 ||
[ రెప్పపాటున వచ్చున్ - రయముగ రాకడలో కొనిపోవున్ ]|2||
[ వేడుడి ప్రార్ధించుడి - సిద్ధముగా నుండుడి ]|2 || ॥ రాజాధిరాజు యేసుడు॥
చరణం 3 :
[ తండ్రిరాక కుమారుడైనను ఎరుగడు ]|2||
[ మరి నీకు ప్రభురాక తెలియునా ]|2 ||
[ సిద్దెవంటి హృదయమును
భద్రపరచి తైలముతో నింపుడి]2|| రాజాధిరాజు యేసుడు||
FULL VIDEO SONG
Search more songs like this one
0 Comments