సేవించెదను నీ సన్నిధిలో / Sevinchedanu Nee Sannidhilo
Christian Song Lyric
Telugu Christian Song Lyrics 2024
Song Credits:
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
Lyrics:
పల్లవి :
[ సేవించెదను నీ సన్నిధిలో
జీవించు దినములన్నీటిలో ]|2|
[ పూజించుటకు యోగ్యుడవు యుగములలో ] |2|
[ స్తోత్రించెదను జనములలో ] |2||సేవించెదను||
చరణం 1 :
[ పొరుగువారంతా కూడుకుని కష్టకాలమున నన్ను గని
నీ దేవుడు ఏమాయేనని హేళన చేసిన గాని ]|2|
[ నీ మాటలు విని నిను నమ్ముకొని ] |2|
కడదాకా నడిచెదను సాక్షిగా నే నిలిచెదను ||సేవించెదను||
చరణం 2 :
[ అధిపతులు మాట్లాడుకొని
కూట సాక్షుల మాటవిని
నన్ను విడిచిపెట్టాలని
నన్ను బెదిరించినా గాని ] |2|
[ నీ మాటలు విని నిను నమ్ముకొని ] |2|
కడదాకా నడిచెదను సాక్షిగా నే నిలిచెదను ||సేవించెదను||
చరణం 3 :
[ బంధువులు నను చేరుకుని
మాతో ఉండుట కూడదని
నాకున్నదంతా దోచుకుని
నను వెలివేసినా గాని ]|2|
[ నీ మాటలు విని నిను నమ్ముకొని ] |2|
కడదాకా నడిచెదను సాక్షిగా నే నిలిచెదను ||సేవించెదను||
0 Comments