Aakashamandhu neevu thappa / ఆకాశమందు నీవు తప్పా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Music: WILSON
Lyrics:
పల్లవి :
[ ఆకాశమందు నీవు తప్పా
నాకింకా ఎవరున్నారయ్యా ](2)
[ నాసర్వం నీవే యేసయ్యా
నాక్షేమం కోరే మెస్సయ్యా ](2) (ఆకాశ..2)
చరణం 1 :
[ నిందల పాలైనా నన్ను చూశావు
నాకోసం ఈ భూమికి వచ్చావు ] (2)
[ నీవే కావాలి నీ సన్నిధి కావాలి ] (2)
నీ ఒడిలో పాపలా నేనొదిగిపోవాలి
యేసు నీ ఒడిలో పాపలా నేనొదిగిపోవాలి (ఆకాశ..2)
చరణం 2 ;
[ అయినా వాళ్లను చూసి మురిశాను
నన్ను వదిలిపోతుంటే దిగులు చెందాను ](2)
[ నా మంచి కాపరివై నా ప్రక్కన చేరావు ](2)
నా గుండెలో బాధలనుండి నెమ్మదినిచ్చావు
యేసు నా గుండెలో బాధలనుండి నెమ్మదినిచ్చావు (ఆకాశ..2)
చరణం 3 :
[ ఒంటరినైయున్నా నన్నోదార్చావు
పరిశుద్ధుల మధ్య చేర్చావు ](2)
[ భయపడకన్నావు నేనున్నానన్నావు ](2)
నాపైనా నమ్మికయుంచి సాగిపో అన్నావు
యేసు నాపైనా నమ్మికయుంచి సాగిపో అన్నావు (ఆకాశ..2)
చరణం 4 :
[ నా చీకటి బ్రతుకులో వెలుగును నింపావు
నా ఆత్మ దీపము వెలిగించావు ](2)
[ విడువను అన్నావు ఎడబాయను అన్నావు ](2)
నా కంటి పాపలా నీవుందువు అన్నావు
యేసు నా కంటి పాపలా నీవుందువు అన్నావు (2) (ఆకాశ..2)
Search more songs like this one
0 Comments