Janma Nicchithive Amma / జన్మనిచ్చితివే అమ్మ Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:,
Music: Wilson Garu
Video Editing: V.Satish ( Khammam)
Lyrics:
పల్లవి :
జన్మనిచ్చితివే అమ్మ జన్మనిచ్చితివే
నవమాసాలు మోసి కని పెంచితివే
నను ప్రేమించితివే నాన్న నను ప్రేమించితివే
నీ హద్దులో నన్ను భయముతొ పెంచితివే
॥జన్మ॥
చరణం 1 :
[ ఆశచూపేటి అమ్మ ఈలోకములోనా
అన్ని కావాలని అనుకుంటినమ్మా] ॥2॥
లోకమును చూసి నాన్న మురిసిన నేనైతే
రెండు కనులుపోయి బాధపడితిని ॥ జన్మ॥
చరణం 2 :
[ గ్రుడ్డివాడిగా అమ్మ మిగిలిపోలేక
పురుగుల మందు త్రాగి చావాలనుకున్నా ]॥2॥
అప్పుడు బాబాయి నాన్న చిన్నమ్మిద్దరు
ప్రభుయేసు మందిరమునకు నన్ను తీసుకెల్లే ॥జన్మ॥
చరణం 3 :
[ కన్నీరు విడిచి అమ్మ ప్రార్థిస్తుండగనే
యేసయ్యా గొప్ప వెలుగు నా కనులనుతాకే ]॥2॥
తాకిన తక్షణమే నాన్న నాకు చూపొచ్చే
యేసయ్యా కృపతోనే నేను బ్రతికితిని ॥జన్మ॥
చరణం 4 :
[ తన సేవచేయుటకు యేసు నన్ను పిలిచాడు
అద్భుత కార్యములను జరిగిస్తున్నాడు ]॥2॥
యేసయ్యా లేకుంటే అమ్మ మరణింతును
ఈరోజు మీలో నిలువక పోవుదును ॥జన్మ॥
Full Video Song
0 Comments