నటించే ఓ నరుడా / Natinche O narudaa Song Lyrics
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics :- J.Yesobu Garu
Music :- K.Y Ratnam Garu
Vocals :- Abhijit Kollam Garu
Lyrics:
పల్లవి:-
నటించే ఓ నరుడా - నమ్ముకోకు ఈ లోకం
నమ్మినవారెందరో మట్టిలో కలిసిపోయారుగా //2//
నీవు నమ్ముకున్నవన్నీ - నీ వెంటరావు మరువకూ /2/
నమ్ము సోదరా - నీవు నమ్ము సోదరీ
నమ్ము సోదరా - ఇది నిజము సోదరీ //నటించే//
చరణం:-1
(నీకు)ధనము బలగమున్న - నీవు అందగాడివైన
మాటకారివైన మంచి ఆటకారివైన //2//
నీ ధనము రాదు వెంట - నీ బలము రాదు వెంట /2/
అందము మోసము - సౌందర్యము వ్యర్థం /2/
నమ్ము సోదరా - నీవు నమ్ము సోదరీ
నమ్ము సోదరా - ఇది నిజము సోదరీ //నటించే//|
చరణం:-2
తల్లిదండ్రులున్న - నీకు భార్య భర్త ఉన్న
కన్న బిడ్డలు ఉన్న నీకు అన్నదమ్ములున్న //2//
ఎవరు రారు వెంట - ఆ దేవుడే నీకు దిక్కు /2/
యేసు రక్తం లోని నీ పాపానికి విమోచన /2/
నమ్ము సోదరా - నీవు నమ్ము సోదరీ
నమ్ము సోదరా - ఇది నిజము సోదరీ //నటించే//
చరణం:-3
దేవుని నమ్మిన వారందరూ లోకాన్ని నమ్ముకోలేదురా
సమస్తమును పెంటతో పోల్చిన
పౌలు మనకు మాదిరి //2//
యేసుక్రీస్తుని నమ్ముకో నీ ఆత్మకు రక్షణ /2/
క్రీస్తు యేసు నందే నీకు నిత్యజీవం /2/
నమ్ము సోదరా - నీవు నమ్ము సోదరీ
నమ్ము సోదరా - ఇది నిజము సోదరీ //నటించే//
0 Comments