Nee krupa Nannu Jeevimpajesenu / నీ కృప నన్ను జీవింపజేసెను Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Nee Krupa Nannu JeevimpaJesenu
Lyrics:
పల్లవి :
[ నీ కృప నన్ను జీవింపజేసెను
నీ కృప నాకు ఆధారము ](2)
నీ కృపయే కదా నను బ్రతికించెను
నీ కృపయే కదా నను బలపరిచెను
నీ కృపయే కదా నను విడిపించెను
నీ కృపయే కదా విజయమిచ్చెను
[ నీ కృప నన్ను జీవింపజేసెను
నీ కృప నాకు ఆధారము ](2)
చరణం 1 :
[ విషవలయముల ఉరులను పన్నిన
అపవాదిని ఎదిరించినది
విసుగక విడువక ఎడబాయని కృప
నన్నిల నిలిపి నడిపినది ](2)
నీ కృపయే కదా ఆశ్రయదుర్గము
నీ కృపయే కదా అనితరసాధ్యము
నీ కృపయేకదా ఆయుష్కాలము
నీ కృపయే కదా ఈ అభిషేకము
[ నీ కృప నన్ను జీవింపజేసెను
నీ కృప నాకు ఆధారము ](2)
చరణం 2 :
[ కఠినుల నడుమ వికటములైన
కపటపు ప్రేమను తొలగించి
కరుణతో బ్రోచి కౌగిట దాచి
నా కన్నీటిని తుడచినది ](2)
నీ కృపయే కదా ఔషధమాయెను
నీ కృపయే కదా గాయము కట్టెను
నీ కృపయే కదా గమనము మార్చెను
నీ కృపయే కదా గమ్యము చేర్చును ||నీ కృప నన్ను||
Full Viseo Song
0 Comments