Yesu Nee Krupayega / యేసు నీ కృపయేగా Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Vocals & Featuring by Pas.Raja Hebel
Song Written, Tune Composed & Music by Symonpeter Chevuri
Lyrics:
పల్లవి :
[ దేవా నీ కృప పొందుటకు - నాలోన ఏమున్నది ]|2|
మలినమైనది నా గతం - చేజారినది నా జీవితం
ఉదయించే నాలో నీ స్వరం - వికసించెనుగా నా హృదయం
[ యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా ]|2|
ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !||దేవా నీ కృప ||
చరణం 1 :
[ వేషధారివని లోకం వెక్కిరించుచుండగా
దారి మరచి నిన్నే విడిచి నీకు దూరమవ్వగా ]|2|
[ కోర్కెలన్ని కన్నీలై - కడకు నిన్ను చేరగా
[ కనికరించి ఓదార్చి స్వీకరించినావుగా ]|2|
కనికరించి ఓదార్చి స్వీకరించినావుగా
[ యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా ]|2|
ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !|| దేవా నీ కృప||
చరణం 2 :
[ ఏ యోగ్యత లేని నన్ను నీవెన్నుకున్నావు
నీ ఉన్నత సేవకు నన్ను పిలుచుకొన్నావు ]|2|
[ ఉప్పులా ఉండాలని - ఊటనై పారాలని
నీలోన నిలచి నే ఫలియించాలని ]|2|
నీలోన నిలచి నే ఫలియించాలని
[ యేసు నీ కృపయేగా - ఇది నీ కృపయేగా ]|2|
ఇది నీ కృపయేగా - వేరే లేదుగా !|| దేవా నీ కృప||
Full Video Song
Search more songs like this one
0 Comments