Jivithame Adi Agani Selayeru / జీవితమే అది ఆగని సెలయేరు Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyric -Tune : Pastor.Steve Paul Manikonda
Music : Bro.KJW Prem
Lyrics:
పల్లవి :
[ జీవితమే అది ఆగని సెలయేరు
జీవితమే అది చేరని పయనం ]|2|
ఎన్నో రాతి దెబ్బలో- ఎన్నో ఆటుపోటులో
ఎన్నో ఎండమావులో - ఎన్నో పాప ఊబులో
[ దేవా రావా తోడు నీడగా - దేవా రావా అండ దండగా ]|2|
||జీవితమే||
చరణం 1 :
రాత్రుల యందు నిద్దుర రాక ఎన్నో అలజడులు
కన్నీటిలోయలో పయనించే నా ఒంటరి వేదనలో
[ ప్రార్థన గదిలో ఎన్నెన్నో ఆకలి కేకలో ]|2|
[ రాగములేని పాటనై ఆగని సాగని పయనంలో ]|2|
[ దేవా రావా తోడు నీడగా - దేవా రావా అండ దండగా ]|2|
||జీవితమే||
చరణం 2 :
[ కటిక చీకటి పెంతుఫానులో సాగిన సెలయేరు
దారి తొలగి గమ్యం మరిచి పారిందీ యేరు ]|2|
[ చెరలోనున్న ప్రాణినై యవ్వన భానిసనై ]|2|
[ విడిపించే ఆ నాధుని కోసం చూస్తుందీ యేరు
నా జీవిత సెలయేరు ]|2|
[ దేవా రావా తోడు నీడగా - దేవా రావా అండ దండగా ]|2|
||జీవితమే||
చరణం 3 :
[ సంతోషంతో ఉరకలు వేస్తూ సాగిన సెలయేరు
తెలియని పాపం సుడిగుండంలో చిక్కుకుంది యేరు ]|2|
[ ఆత్మవంచన చేసుకునే ఆలోచనలతో ]|2|
[ అనుదినము క్షమించమంటూ కన్నీటితో చూస్తుందీ యేరు
నా జీవిత సెలయేరు ]|2|
[ దేవా రావా తోడు నీడగా - దేవా రావా అండ దండగా ]|2|
||జీవితమే||
Full Video Song
Search more songs like this one
0 Comments