Alone / అలోన్ Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Eli moses
Edurumondi Moses|
Yedidyah Pictures
Lyrics:
పల్లవి :
[ ఏమాయే ఏమాయే ఓ మనిషి నీ బంధాలన్నీ ఏమాయే రా
ఏమాయే ఏమాయే ఓ మనిషి నీ సంపదలన్నీ ఏమాయే రా ]|2|
[ ఒంటరిగానే మిగిలవా మరుభూమిలో మనిషి ]|2|
[ ఇదే సత్యము ఇదే బ్రతుకు నిత్యము ]|2|| ఏమాయే ఏమాయే||
చరణం 1 :
[ అది ఇది నాదన్నావు -అన్నిటిలో నీవున్నావు
అందరు నాతో ఉన్నారు నాకేమనుకున్నావు ]|2|
[ తెలియని తెగులే వెంటాడి వేధించిందా మనిషీ
ఏది సత్యమో ఏది నిత్యమో తెలిపిందా మనిషీ ]|2|
తెలుసుకునే సమయానికి ఈ భూమిని వదిలేశావ మనీషీ
[ ఇదే సత్యము ఇదే బ్రతుకు నిత్యము ]|2|| ఏమాయే ఏమాయే||
చరణం 2 :
[ నిలకడ లేని పరుగు - ఆగక సాగిన అడుగు
పగలు రేయి సంపాదనకై సాగిందా బ్రతుకు ]|2|
[ ఇలాంటి కాలం వస్తుందని అనుకున్నావా మనిషీ
వచ్చే మరణం ఆగదని నువు మరిచావా మనిషీ. ]|2|
తెలుసుకునే సమయానికి నీ చేయి దాటిపోయింది మనిషీ
[ ఇదే సత్యము ఇదే బ్రతుకు నిత్యము ]|2|| ఏమాయే ఏమాయే||
చరణం 3 :
[ నేనే గొప్పన్నావు - నాకేదురే లేదన్నావు
సృష్టిని శాసించే జ్ఞానం నాదే అన్నావు ]|2|
[ కరోనా పురుగు కలవర పెడితే కుమిలావ మనిషీ
దానిని గెలిచే దారి తెలియక ఓడావా మనిషీ ]|2|
ఇప్పుడేమో సమాధి తోటలో అనాథ శవమైనవా మనిషీ
[ ఇదే సత్యము ఇదే బ్రతుకు నిత్యము ]|2|| ఏమాయే ఏమాయే||
Full Video Song
0 Comments