Chanchala manasu / చంచల మనస్సు Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
TUNE@ MUSIC:BRO SUNIL GARU
VOCALS: BRO SIDDU GARU
TABALA: BRO PAUL RAJ GARU HYD
FLUTE ; BRO SRINIVAS GARU HYD
Lyrics:
పల్లవి :
[ చంచల మనస్సును విడువుము
స్థిరమైన మనస్సుతో బ్రతుకుము ](2)
మాటను ఇచ్చి మరువకుము - నీ స్థితి ఏదైనా వెనుదిరుగకుము
[ నీవు స్థిరపరచబడుదువు గ్రహించుము ](2) ॥చంచల॥
చరణం 1 :
[ ఇస్సాకును నాడు - బలి అడుగగా
బయలు దేరెను - తాను అర్పించగా ](2)
స్థిరమైన మనస్సుతో - ముందుకు సాగెనుగా (2)
బలినరించి - నిలిచినాడు మాటపై స్థిరముగా (2) ॥చంచల॥
చరణం 2 :
[ మందసమే తనకు బహుముఖ్యముగా
భావించి భార్యకు - ఉన్నాడు దూరముగా ](2)
తిని త్రాగుటకన్నా - ప్రాముఖ్యతనెగా (2)
పలికిన ఉరియా - నిలిచినాడు మాటపై స్థిరముగా (2) ॥చంచల॥
చరణం 3 ;
[ ద్రాక్షారసమును - తగదనిరిగా
పితరుల మాటకు బయపడి బ్రతికారుగా ](2)
గుడారములలో నివసించినారుగా (2)
రేకాబీయులు - నిలిచినారు మాటపై స్థిరముగా (2) ॥చంచల||
Full Video Song
0 Comments