Deva Nee Daya Lekapothe Nene Mouduno / దేవా నీ దయ లేకపోతే Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2023
Song Credits:
Music Composed: Anil Aldrin
Vocals: Ravi Sankar R
Lyrics:
[ దేవా నీ దయ లేకపోతే నేనేమౌదునో
దేవా నీ కృప లేకపోతే నేనేమౌదునో ]- 2
[ ఆకాశమందు నీవు తప్పనాకెవరున్నారు
ఈ లోకమందు నాసర్వం నీవేకదా ] - 2
కన్నీటితో ఎదురుచూస్తున్న నీకొఱకై
దుఃఖముతో ఎదురుచూస్తున్న నీమేలుకై
[ క్రీస్తు యేసు నీ ప్రేమ నిజమైనది
క్రీస్తు యేసు నీ ప్రేమ నిత్యమైనది ] - 2
1.
[ ప్రేమించిన వారే ద్వేషించగా
ద్వేశించిన నాకై నీ ప్రాణమివ్వగా ] - 2
[ మేలుపొందుకున్నవారే మరచిపోగా
మరువకనే నన్ను ప్రేమించినావుగా ]-2
[ క్రీస్తు యేసు నీ ప్రేమ ద్వేషించనిది
క్రీస్తు యేసు నీ ప్రేమ మరచిపోనిది ] - 2
2.
[ ప్రేమించిన వారే విడిచివెళ్లిన
ప్రేమించని నాకై నీవు మరణించగా ] - 2
[ ఆశించిన వారే నిరాశపరచగా
క్రుంగియున్న నన్నే హత్తుకొనెనుగా ] - 2
[ క్రీస్తు యేసు నీ ప్రేమ వీడిపోనిది
క్రీస్తు యేసు నీ ప్రేమ మాన్యమైనది ] - 2
3.
[ నమ్మదగిన వారికై నేను వెదకగా
నమ్మదగిన తండ్రిగా నీవే ఉండగా ] - 2
[ విడువని ప్రేమకై నేను చూడగా
విడువని ప్రేమతో రక్షించెనుగా ]- 2
[ క్రీస్తు యేసు నీ ప్రేమ నమ్మదగినది
క్రీస్తు యేసు నీ ప్రేమ మారిపోనిది ] - 2
4.
[ నీ ఆత్మతో ప్రేమతో నన్ను నింపవా
నిత్యము నన్ను నీలో స్థిరపరచవా ] - 2
[ నీ చిత్తమంతా నాలో జరిగించవా
క్రీస్తువలే నన్ను మహిమపరచవా ] - 2
[ క్రీస్తు యేసు నీ ప్రేమ ఘనమైనది
క్రీస్తు యేసు నీ ప్రేమ యోగ్యమైనది ] - 2
5.
[ నా జీవితాన్ని ఆశీర్వదించవా
సమృద్ధిగా మేలులు నాకు చూపావా ] - 2
[ ఒంటరైన నన్ను విస్తరింపజేయవా
నీవు తెరచిన ద్వారాన్ని ఎవరు వేయలేరుగా ] - 2
[ క్రీస్తు యేసు నీ ప్రేమ రమ్యమైనది
క్రీస్తు యేసు నీ ప్రేమ స్థిరమైనది ] - 2
0 Comments