ధనవంతులలో దైవ భక్తులు / Dhanavantulalo Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics:
పల్లవి:-
[ ధనవంతులలో దైవ భక్తులు
ధనమెంతున్న దేవుని కిష్టులు ] ll2ll
ఎంత ధనమున్న దురుసు గర్వము లేని భక్తులు
గొప్ప పదవున్న తిరస్కారము చూపని భక్తులు
అధికారమెంతున్న న్యాయము మరువని నీతిమంతులు
బలమెంత ఉన్న దేవునికే మహిమ తెచ్చిన
యథార్థవంతులు ll ధన ll
చరణం 1 :
కోటలే కట్టలేదు బహుదనవంతుడైన అబ్రహాము
ఆశీర్వాదము పొందిన దైవ ఆజ్ఞను మాత్రం మీరలేదు
గొప్పవాడైన యోబు దేవుని భయము భక్తి విడలేదు
సంపదలు ఎన్ని ఉన్న ప్రతిదినము అర్పణలు మరువలేదు
ఉన్నాయని ఆశపడలేదు పోయాయని బాధపడలేదు
దీనులపై కనికరం చూపి దేవునికే అప్పిచ్చెను
సంపాదనంతా ఇచ్చి దేవున్ని సంపాదించెను ll ధన ll
చరణం 2 :
ఆస్తిని బీదలకిచ్చెను ధనవంతుడైయున్న జక్కయ్య
రక్షణ భాగ్యమిచ్చే దైవ కుమారుని పిలుపు పొందెను
శతాధిపతియైన కొర్నెలి తన ఇంటికి భక్తి నెర్పెను
ధనమునే దాచుకోక ప్రతిదినము ధర్మములు చేసెను
ధనాపేక్షతో భక్తిని చేయక ఇచ్చిన
ధనమును దీనులకు దానమిచ్చెను
దాచుకుంటే నీ ధనముకు చెదలు పడుతుంది
దేవుని సేవకిస్తే నీ ధనమే దాచబడుతుంది ll ధన ll
చరణం 3 :
ఆరాధనను మానలేదు ఐతీయోపీయుడైన నపుంసకుడు
వాక్యమును పరిశీలించి బాప్తిస్మము వెంటనే పొందుకొనెను
ప్రధానుడైయున్న పౌలు ప్రభు పనికై పిలుపు నొందెను
డేరాలు కుట్టుకుంటూ తనను తానే వ్యయపరిచెను
ధనమెంత ఉన్నను గర్విష్టివి కాక
సర్వము దయచేయు దేవునికే లోబడు
ధనము ఉంటే కనిపిస్తుంది నిజమైన భక్తి నీలో
ధనమునే నమ్ముకుంటేనెమ్మది లేదు ఏ లోకానా ll ధన ll
Full Video Song
0 Comments