Idhe Aasa Naalo / ఇదే ఆశ నాలో Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Music Composed and Arranged by : Pranam Kamlakhar
Vocals : Ankona Mukherjee
Mix & Master : AP Sekar
Lyrics:
పల్లవి :
ఇదే ఆశ నాలో నా యేసయ్య
నీ ప్రేమలోనే జీవించనీ
ఇదే ధ్యాస నాలో నా యేసయ్య
నీ నీడలోనే నేనుండనీ
ఏపాటి నన్ను ప్రేమించినావు
నీలోన నిరతం నను దాచినావు
ఏముంది నాలో కోరావు నన్ను
దీవించి ఇలలో ఘనపరచినావు
[ ప్రాణమా నా బంధమా నీ ప్రేమ చాలయ్యా
దైవమా నా యేసయ్య నీ తోడు చాలయ్యా ]|2|ఇదే ఆశ నాలో|
చరణం 1 :
గాయాలలోన కన్నీటిలోన ఓదార్పు నీవై చేరావుగా
నిస్సారమైన నా జీవితాన నా కోట నీవై నిలిచావుగా
ఆధార దీపం నీ వాక్యమేగా
నా క్షేమ సౌధం నీ సన్నిధేగా
ఏమివ్వగలను సేవింతు నిన్ను|ఇదే ఆశ నాలో|
చరణం 2 :
గాఢాంధకార ఏలోయలైనా నావెంట నీవే ఉన్నావుగా
నీ నీతిమార్గం పరలోక భాగ్యం నాచెంత చేరీ చూపావుగా
లెక్కించలేను నీ మేలులన్నీ
ఊహించలేను నీ ప్రేమ నాకై
ఏమివ్వగలను సేవింతు నిన్ను|ఇదే ఆశ నాలో|
Full Video Song
0 Comments