NAA PAI NEE EMPIKA / నాపై నీ ఎంపిక Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Music: Bro. Enoch Jagan
Tune & Keys Collaborator: Bro. Dani Babu
Lyrics: Bro. Prateek Raj
Lyrics:
పల్లవి :
[ ఈనాటికి నేనెరుగను నాపై నీ ఎంపిక ఏలనో..
ఏనాటికి నే మరువను నాపై ఈ ప్రేమ ఏలనో..]|2|
ఏముందని చూడక - పాపినని విడువక
కొలతలేని కృపను కురిపించినావు మానక..
ఏముందని చూడక - పాపినని విడువక
ఎనలేని ప్రేమను కురిపించినావు మానక..
తండ్రీ - నా పరమతండ్రీ
ఏనాటికి మారనే మారదు -
నీ దివ్య ప్రేమ - నీ దివ్య ప్రేమా.||ఈనాటికి||
చరణం 1 :
[ లోకాశలకు లొంగి - ఓడిపోయిననూ
కన్నవారే కఠినులై - కాదనిననూ ](2)
[ పిలిచావు నన్నే - కావాలనంటూ..
దాచావు నీ కౌగిలిలో భద్రముగా.. ](2)
తండ్రీ - నా పరమతండ్రీ
ఏనాటికి మారనే మారదు -
నీ దివ్య ప్రేమ - నీ దివ్య ప్రేమా.||ఈనాటికి||
చరణం 2 :
[ పరిశుద్ధముగా నీకై జీవించాలనీ
పరలోకములో నీతో పరవశించాలనీ ](2)
[ దీవించుమయ్యా - బలపరచుమయ్యా
నడిపించు నీ ఆత్మతో నీ సాక్షిగా.. ](2)
తండ్రీ - నా పరమతండ్రీ
ఏనాటికి మారనే మారదు -
నీ దివ్య ప్రేమ - నీ దివ్య ప్రేమా.||ఈనాటికి||
Full Video Song
0 Comments