Teliyadhuga satyam / తెలియదుగా సత్యం Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Vocals: Nissy John
Music: JP Ramesh
Dop: Sudhakar
Rhythm: Kishore
Flute: Pramod
Lyrics:
పల్లవి :
క్షణములోనే మరణించే మనిషికి ఎందుకంత కోపం
ఆ క్షణములోనే నీవు మరణిస్తే మరి ఎక్కడ నీ పయనం
మట్టిలోనికి పోయే దేహమునకు ఎందుకంత ద్వేషం
మరణిస్తే మళ్ళీ బ్రతుకున్నదటని తెలియదుగా సత్యం
చరణం 1 :
చెడుపనులను చేయుచు ఉంటే ఒక్క ఆటగా ఉన్నదట
మూర్ఖపు పనులను చేయుటకే ఆ మూర్ఖులకిష్టమట
అందులోనే ఆనందం ఉన్నదని
అందులోనే ఆనందం ఉన్నదని ఆనందిస్తారట
అందులోనే మా అంతమున్నదని తెలియదు వారికట
తెలియదు వారికట ||క్షణములోనే||
చరణం 2 :
మంచి మాటలు ఎన్ని చెప్పిన మనస్సు మారదంట
నీతి మార్గములో నడుచుదమంటే ఇష్టమే లేదంట
స్వర్గం నరకం ఉన్నదంటని ఆ.. ఆ..
స్వర్గం నరకం ఉన్నదంటని మరచిపోయిరంట
మరణించిన తర్వాత ఏమవుదునో అని ఆలోచించారంట
ఆలోచించారంట ||క్షణములోనే||
చరణం 3 :
కన్న తండ్రినే మరిచిపోయి ఇక జీవిస్తున్నరట
కంటికి రెప్పల కాపాడే ఆ దేవుని మరిచిరట
నిను ప్రేమిస్తున్నది యేసునంటే
నిను ప్రేమిస్తున్నది యేసునంటే కోపమొస్తదంట
ప్రేమించే దేవుని ద్వేషించి ఇక వెళ్ళిపోతరంట
ఇక వెళ్ళిపోతరంట ||క్షణములోనే||
Full Video Song
0 Comments