ఏదో అనుకుంటే ఏదో జరిగిందా / Yedho Anukunte Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics & Tunes: Bro.P.Srinivas
Music: Emmanuel Prem
Vocals: Shylaja Nuthan
Video Edit: Eshwar C Paul
Lyrics:
పల్లవి:
ఏదో అనుకుంటే ప్రభువా మాకు ఏదో జరిగింది దేవా
మేము ఒకటి కోరుకున్న యెహోవా మీరు ఒకలా మార్చారు దేవా
మా తలంపులు వేరయా మీ తలంపులు వేరయా
మా ఆశలు వేరయా మీ ఆశలు వేరయా
అయినా మీ చిత్తమే ఏదైనా మీకు స్తోత్రమే
మీరు ఏది చేసినా మా కోసమే
మాకు ఉన్నవన్నీ మీకోసమే||ఏదో అనుకుంటే||
చరణం1:
ఇస్సాకును బలి ఇమ్మని
అబ్రహామును నీవు కోరగా ఒక కొడుకుని భావించక
బలి ఇచ్చుటకే తెగించెను
మరలా తన విశ్వాసం చూసినావు నీవు
తన కుమారుని తనకిచ్చి పంపి వేసినావు
విశ్వాస యాత్రలో విజయము పొందెనని
విశ్వాసులకు తండ్రిని ప్రకటించినావు
పరీక్ష లేనిదే పరలోకం లేదని
నిరీక్షణ కలిగి భక్తిలో జీవించాలని || ఏదో అనుకుంటే ప్రభువా ||
చరణం2:
యోసేపు తన అన్నలు అమ్మి వేసినా
నిన్ను విడువలేదు యజమానుని భార్య కోరిన
తప్పు చేయక పారిపోయెను
ఒంటరివాడైనా నిన్ను మహిమ పరిచినాడు
పాపము చేయక నిన్ను వదలక ఉన్నాడు
తన భక్తిని చూసి సంతోషించావు
ఐగుప్తుపైన అధికారం ఇచ్చినావు
సహనము లేనిదే సజీవులు కారని
భక్తి జీవితంలో బలైపోవాలని || ఏదో అనుకుంటే ప్రభువా ||
Full Video Song
0 Comments