యేసయ్యా నీ ప్రేమ / Yesayya Nee Prema Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
ANGEL Ministries
Lyrics:
పల్లవి :
యేసయ్య నీ ప్రేమ -అద్భుతమైనది
యేసయ్య నీ కృప- వర్ణింపలేనిది
నా దేవా- నీ త్యాగం- ఎవరూ చేయనిది ,
నా దేవా -నా జీవం నీలో దాచితివే
"యేసయ్య నీ ప్రేమ"
చరణం 1 :
[ తల్లి గర్భంలో నుండే - నన్ను ఎరిగిన దేవా,
పేరు పెట్టి నను పిలచి- నీకై నిలిపిన దేవా ] (2)
[ తల్లి మరచిన, తండ్రి విడచిన విడువను అంటివే ](2)
విడువను అంటివే…... "యేసయ్య నీ ప్రేమ"
చరణం 2 :
[ పాపినైన నా కొరకై- చిందితివి నీ రక్తము,
యోగ్యతే.. లేని నాకై- ఇచ్చితివి నీ ప్రాణం ](2)
[ ఎందుకయ్యా ఇంత ప్రేమ నేనంటే నీకు ](2)
నేనంటే నీకు ....."యేసయ్య నీ ప్రేమ"
చరణం 3 ;
[ నిత్యం నాతో నుండుటకై- మహిమనంతా వీడితివే,
నిత్యజీవము నాకివ్వగ- పరిశుద్ధునిగా జేసితివే ](2)
నీవు తప్ప- నాకు ఇలలో- ఎవరు యేసయ్యా (2)
ఎవరు నా యేసయ్యా.... "యేసయ్య నీ ప్రేమ"
Search more songs like this one
0 Comments