The Blessing in Praises, 100 Praises of Worship In Telugu

christian song lyrics, christian telugu songs lyrics, christian english songs lyrics, christian tamil songs lyrics, christian hindi songs lyrics, christian malayalam songs lyrics, chriatian kannada songs lyrics christian bengali songs lyrics.

💚స్తుతులలో  ఉన్న ఆశీర్వాదము💛

💜100 స్తుతుల ఆరాధన💚

👉ప్రార్ధన ;

- క్రీస్తునందు మా దేవా, మా తండ్రీ, నాకు ఉపదేశముగా నీ పరిశుద్ధ వాక్యమును ఇచ్చినందుకు వందనములు. 
నీ వాక్యమును ఉన్నతముగా ప్రేమించుటకు, సంపూర్ణముగానమ్ముటకు, నిజముగా దాని ప్రకారము జీవించుటకు, ఆసక్తితోదానిని నిరతము వెంబడించుటకు, ధృడ నిశ్చయముతో దానియందు ఆధారపడుటకు, దానిని నిరతమువెంబడించుటకు, దానిని  స్థిరముగా పాటించుటకు,ఉన్నపాటున విధేయత చూపుటకు, దానికి నమ్మకముగా సాక్ష్యమిచ్చుటకు, దాని వాగ్దానములను పూర్తిగా నెరవేర్చుటకు,దాని స్వరమును శ్రద్ధగా వినుటకు, దాని ప్రవచనములను సూక్ష్మముగా చూచుటకు, దానికి ప్రేమతో జవాబిచ్చుటకు,పవిత్రముగా దానిని ఉపయోగించుటకు, మరియు భక్తిపూర్వకముగా దాని ఆత్మలోనికి ప్రవేశించుటకు నీ పరిశుద్ధాత్మ యొక్క కృపలో నన్ను బలపరచుము. సర్వమునకుయోగ్యుడైన యేసు నామముననే ప్రార్ధించుచున్నాను.
ఆమేన్.

👉దేవుని ధ్యానములు;💗

1. శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్తయైనదేవా (ఆది 1:2) - మీకు స్తోత్రములు

2. నిరాకారమునకు ఆకారము కలుగజేసిన సృష్టికర్తయైనదేవా (ఆది 1:2) - మీకు స్తోత్రములు

3. నోటిమాటచేత భూమిని, ఆకాశమును, సముద్రమునుసృష్టించిన సృష్టికర్తయైన దేవా (ఆది 1:8-10)- మీకు స్తోత్రములు

4. నోటిమాట చేత సూర్యుని, చంద్రుని, నక్షత్రములనుసృష్టించిన సఋష్టికర్తయైన దేవా (ఆది 1:14-16)- మీకు స్తోత్రములు

5. నోటిమాటచేత భూజంతువులను, ఆకాశ పక్షులను,సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్తయైన దేవా(ఆది 1:20-25) - మీకు స్తోత్రములు

6. నోటిమాటచేత చెట్లను, వృక్షములను సృష్టించినసృష్టికర్తయైన దేవా(ఆది1:12) - మీకు స్తోత్రములు

7. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు, మీ పోలిక చొప్పుననేలమంటితో నరులను నిర్మించిన సృష్టికర్తయైనదేవా(ఆది 2:7) - మీకు స్తోత్రములు

8.రాజాధి రాజా, ప్రభువులకు ప్రభువా, దేవాది దేవా(1తిమోతి 6:15)మీకు స్తోత్రములు

9. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షనీయుడా| (పరమ 5:10,16) - మీకు స్తోత్రములు

10. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా,నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి(యెషయా 9:6) - మీకు స్తోత్రములు

11. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము,పూజింపదగిన నామము గల దేవా (కీర్తన 111:9)మీకు స్తోత్రములు

12. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకుస్తుతినొందదగిన నామము గల దేవా (కీర్తన 113:3) -మీకు స్తోత్రములు

13. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా (ఫిలిప్పీ2:11) - మీకు స్తోత్రములు

14. పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడైయున్న దేవా (కీర్తన47:8) - మీకు స్తోత్రములు

15. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనముఅని చెప్పిన దేవా (మత్తయి 5:34) - మీకు స్తోత్రములు

16. సైన్యములకధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేతకొనియాడబడుచున్న దేవా (యెషయా 6:3)మీకు స్తోత్రములు

17. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచుఅమరత్వము గల దేవా (1 తిమోతి 6:16)మీకు స్తోత్రములు

18. శక్తి చేతనైనను, బలము చేతనైనను కాక నా ఆత్మచేతనేకార్యము జరుగును అని చెప్పిన దేవా (జెకర్యా 4:7)- మీకు స్తోత్రములు

19. భూమి మీద కఋప చూపుచు నీతి న్యాయములుజరిగించుచున్న దేవా (యిర్మీయా 9:24)
మీకు స్తోత్రములు

20. నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా (హెబ్రీ13:8) - మీకు స్తోత్రములు

21. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనాకలదా అని చెప్పిన దేవా (యిర్మీయా 32:27) - మీకు స్తోత్రములు

22. మారని వాడా,మార్పులేని వాడా, మాట తప్పనివాడా(కీర్తన 146:6) - మీకు స్తోత్రములు

23. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము నేనునిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అనిచెప్పిన దేవా (కీర్తన 50:15) - మీకు స్తోత్రములునిన్ను

24. నీ భారము యెహోవా మీద మోపుము ఆయనేఆదుకొనును అని చెప్పిన దేవా (కీర్తన 55:22) - మీకు స్తోత్రములు

25. నీ కోరిక ను సిద్దింపజేసి, నీ ఆలోచన యావత్తునుసఫలపరచుదును అని చెప్పిన దేవా (కీర్తన 20:4) - మీకు స్తోత్రములు

26. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానుగనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను అనిచెప్పిన దేవా (యిర్మీయా 31:3) - మీకు స్తోత్రములు

27. మనుష్యులను నమ్ముకొనుటకంటే యెహోవానుఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటేయెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా(కీర్తన 118:8,9) - మీకు స్తోత్రములు

28. నన్ను ప్రేమించువారిని ఆస్థికర్తలుగా చేయుదును వారినిధులను నింపుదునని చెప్పిన దేవా (సామెతలు 8:21)మీకు స్తోత్రములు

29. నేను నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవనలసినమార్గమును నీకు భోధించెదను అని చెప్పిన దేవా (కీర్తన32:8) - మీకు స్తోత్రములు

30. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదనుఅని చెప్పిన దేవా (యెషయా 49:25)మీకు స్తోత్రములు

31. నేను మీతో కూడ నివసించుదును, మీలో ఉందును అనిచెప్పిన దేవా (యోహాను 14:17) - మీకు స్తోత్రములు

32. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంటకుప్ప మీదనుండి బీదలను పైకెత్తువాడా (కీర్తన 113:8) - మీకుస్తోత్రములు

33. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించి వారినిఆదుకొనువాడా (కీర్తన 146:9) - మీకు స్తోత్రములు

34. ఇశ్రాయేలీయుల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపుబానిసత్వం నుండి విడిపించిన దేవా (నిర్గమ 2:23) -మీకు స్తోత్రములు

35. ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిననేలమీద ఇశ్రాయేలీయులను నడిపించిన దేవా (నిర్గమ14:21,22) - మీకు స్తోత్రములు

36. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీయులనుపోషించిన దేవా (కీర్తన 78:24) - మీకు స్తోత్రములు
37. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలీయుల దప్పిక తీర్చినదేవా (సంఖ్యా 20:11) - మీకు స్తోత్రములు

38. వగలు మేము స్థంభమై, రాత్రి అగ్ని స్థంభమైఇశ్రాయేలీయులను నడిపించిన దేవా (నిర్గమ 13:21)మీకు స్తోత్రములు

39. ఇశ్రాయేలీయుల స్తుతుల ద్వారా యెరికో గోడ కూల్చివేసిన దేవా (యెహెూషువ 6:20) - మీకు స్తోత్రములు

40. ఇశ్రాయేలీయుల కనాను యాత్ర లో 40 సంవత్సరాలువారి బట్టలు పాతగిలిపోకుండా, వారి చెప్పులుఅరిగిపోకుండా నడిపించిన దేవా (ద్వితియోప 29:5)- మీకు స్తోత్రములు

41. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలుప్రవహించే కనాను దేశానికి చేర్చిన దేవా (యెహోషువ14:1) - మీకు స్తోత్రములు

42. నోవహును తన కుటుంబాన్ని జల ప్రళయము నుండిరక్షించిన దేవా (అది 8:15, 16) - మీకు స్తోత్రములు

43. బానిసగా అమ్మబడిన యోసేపు ని హెచ్చించి అదే దేశానికిప్రధానిగా చేసిన దేవా (అది 41:41) - మీకు స్తోత్రములు

44. గొర్రెలు కాచుకునే దావీదుని లేవనెత్తి రాజు గా తర్వాతచక్రవర్తిగా హెచ్చించిన దేవా (2 సమూ 5:3) - మీకు స్తోత్రములు

45. యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రులను నిలిపినదేవా (యెహోషువ 10:12) - మీకు స్తోత్రములు

46. యెహెజ్కేలు ప్రార్ధించగా ఎండిన ఎముకలకు జీవంపోసిన దేవా (యెహెజ్కేలు 37:5) - మీకు స్తోత్రములు

47. హిజ్కియా ప్రార్ధించగా ఆయుష్షు పొడిగించిన దేవా(యెషయా 38:5,6) - మీకు స్తోత్రములు

48. ఏలియా ప్రార్ధించగా ఆకాశము నుండి అగ్నిని దింపినదేవా (1 రాజులు 18:38) - మీకు స్తోత్రములు

49. దానియేలు ప్రార్ధించగా సింహాల నోళ్ళను మూసి అతనినిరక్షించిన దేవా (దానియేలు 6:22) - మీకు స్తోత్రములు

50. షడ్రకు, మేషాకుచ అబేద్నెగో లను అగ్నిగుండం నుండిరక్షించిన దేవా (దానియేలు 3:26)- మీకు స్తోత్రములు

51. ఎలుగుబంటిని, సింహాన్ని చంపటానికి దావీదుకిశక్తినిచ్చిన దేవా (1 సమూయేలు 17:36) - మీకు స్తోత్రములు

52. హనోకు, ఏలియాలను మరణం లేకుండా పరలోకానికితీసుకువెళ్ళిన దేవా (ఆది 5:24, 2 రాజులు 2:11) -మీకు స్తోత్రములు

53. తల్లిదండ్రులు లేని, అనామకురాలైన ఎస్తేరును దీవించిమహారాణిగా చేసిన దేవా (ఎస్తేరు 2:7,17) - మీకు స్తోత్రములు

54. అన్యురాలు, విధవరాలైన రూతును ఆదుకొని,ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా(మత్తయి 1:5) - మీకు స్తోత్రములు

55. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలమిచ్చిన దేవా (ఆది 21:2) - మీకు స్తోత్రములు

56. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి,మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమునుధరించుకొని, రిక్తునిగా చేసుకున్న యేసయ్యా (ఫిలిప్పీ2:6,7) - మీకు స్తోత్రములు

57. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడై ఉండుటకుదిగి వచ్చిన యేసయ్యా (మత్తయి 1:23) - మీకు స్తోత్రములు

58. నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగి వచ్చినయేసయ్యా (లూకా 19:10) - మీకు స్తోత్రములు

59. లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొట్టెపిల్ల(యోహాను 1:29) - మీకు స్తోత్రములు

60. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా,నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతునుఅని చెప్పిన దేవా (మత్తయి 11:28) - మీకు స్తోత్రములు

61. కానాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చినయేసయ్యా (యోహాను 2:7-9) - మీకు స్తోత్రములు

62. ఐదు రెట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి ఐదువేలమందికి పంచిపెట్టిన యేసయ్యా (మత్తయి 14: 19-21)మీకు స్తోత్రములు

63. దెయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్యా (మత్తయి 8:17)- మీకు స్తోత్రములు

64. కుంటివారికి నడకనిచ్చిన యేసయ్యా (మత్తయి 21:14) -మీకు స్తోత్రములు

65. మూగవారికి మాటనిచ్చిన యేసయ్యా (మత్తయి 15:30)మీకు స్తోత్రములు

66. గ్రుడ్డి వారికి చూపునిచ్చిన యేసయ్యా (మత్తయి 15:30)మీకు స్తోత్రములు

67. కుష్ఠురోగులను బాగుచేసిన యేసయ్యా (లూకా 17:11-14) - మీకు స్తోత్రములు

68. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రము సెలవిచ్చిబాగుచేసిన యేసయ్యా (మత్తయి 8:13) - మీకు స్తోత్రములు

69. 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీ ని బాగుచేసినయేసయ్యా (మార్కు 5:25-29) - మీకు స్తోత్రములు-

70. 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీ ని బాగుచేసినయేసయ్యా (లూకా 13: 11-13) - మీకు స్తోత్రములు

71. 38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగుచేసినయేసయ్యా (యోహాను 5:5-9) - మీకు స్తోత్రములు

72. చనిపోయిన నాయీను విధవరాలి కుమారుని బ్రతికించినయేసయ్యా (లూకా 7:11-15) - మీకు స్తోత్రములు

73. చనిపోయిన మాయీరు కుమార్తె ను బ్రతికించినయేసయ్యా (లూకా 8:54,55) - మీకు స్తోత్రములు

74. చనిపోయిన లాజరును నాలుగు రోజుల తర్వాత సమాధినుండి లేపిన యేసయ్యా (యోహాను 11:43, 44)మీకు స్తోత్రములు

75. మా దోషములను బట్టి నలుగగొట్టబడిన యేసయ్యా(యెషయా 53:5) - మీకు స్తోత్రములు

76. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేస్తున్నయేసయ్యా (యెషయా 53:5) - మీకు స్తోత్రములు

77. నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్యా (అపొ.కా.20:28) - మీకు స్తోత్రములు

78. మా దరిద్రతను కొట్టివేసి, మమ్మల్ని ధనవంతులుగామార్చడానికి మాకోసం దరిద్రుడిగా మారిన యేసయ్యా(2 కొరింథీ 8:9) - మీకు స్తోత్రములు

79. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి, మమ్మల్నిఆశీర్వదించడానికి మాకోసం సిలువలో శాపగ్రస్తుడిగామారిన యేసయ్యా (గలతీ 3:13,14)మీకు స్తోత్రములు

80. మా పాపముల నిమిత్తం సిలువ శిక్షను అనుభవించిమాకోసం శిలువలో మరణించిన యేసయ్యా (హెబ్రీ9:28) - మీకు స్తోత్రములు

81. మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి, మాకోసం అర్దాయువులో మరణించిన యేసయ్యా (మార్కు 15:44) - మీకుస్తోత్రములు

82. సమాధిని గెలిచి, మరణపు ముల్లు ను విరిచి,మృత్యుంజయునిగా మూడవ దినాన తిరిగి లేచినయేసయ్యా (లూకా 24:5,6) - మీకు స్తోత్రములు

83. యేసు రక్తము ద్వారా ప్రతి పాపమునుండి మమ్మల్నిపవిత్ర పరుస్తున్న దేవా (1 యోహాను 1:7) - మీకు స్తోత్రములు

84. యేసు రక్తము ద్వారా మా మనసాక్షిని శుద్ధి చేస్తున్నదేవా (హెబ్రీ 9:14) - మీకు స్తోత్రములు

85. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలుగచేసినదేవా (ఎఫెసీ 1:7) - మీకు స్తోత్రములు

86. యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితంగానీతిమంతులుగా మార్చిన దేవా (రోమా 5:9) - మీకుస్తోత్రములు

87. అపవాది శక్తుల పైన మాకు జయమిచ్చిన యేసయ్యా(లూకా 10:19) - మీకు స్తోత్రములు

88. అపవాది తలను శిలువలో చితకద్రొక్కిన యేసయ్యా(ఆది 3:15) - మీకు స్తోత్రములు

89. సాతానును మా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకత్రొక్కిస్తానన్న యేసయ్యా (రోమా 16:20)-మీకు స్తోత్రములు

90. జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకులోబడిన వారిని విడిపించిన యేసయ్యా (మత్తయి 4:16)- మీకు స్తోత్రములు

91. మీ సిలువ మరణంచేత అపవాదిని, వాడి అనుచరులనునిరాయుధులుగా చేసి మాకు జయోత్సాహం ఇచ్చినయేసయ్యా (కొలస్సీ 2:15) - మీకు స్తోత్రములు

92. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చియు, నీతినిగూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపచేయుచున్నపరిశుద్ధాత్మ దేవా (యోహాను 16:8) - మీకు స్తోత్రములు

93. మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మ దేవా (యోహాను 16:13) - మీకు స్తోత్రములు

94. సంబవింపబోవు సంగతులను మాకు తెలియజేయుచున్నపరిశుద్ధాత్మ దేవా (యోహాను 16:13) - మీకుస్తోత్రములు

95. ఉచ్ఛరింప శక్యము కాని మూలుగులతో మా పక్షముగావిజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్క దేవా (రోమా 8:26)- మీకు స్తోత్రములు

96. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవా(యోహాను 14:26) - మీకు స్తోత్రములు

97. మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్నయేసయ్యా (రోమా 8:34) - మీకు స్తోత్రములు

98. పరలోకంలో మా కొరకు నివాసములు ఏర్పరుచుచున్నయేసయ్యా (యోహాను 14:2) - మీకు స్తోత్రములు

99. ముత్యపు గుమ్మాలు కలిగి, బంగారపు వీధులు కలిగినపరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోవుచున్నయేసయ్యా (ప్రవటన 21:21) - మీకు స్తోత్రములు

100. పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళుటకు త్వరలో

సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక 🙏🙏 ఆమేన్ 

👉For More Visit🙏🙏

Post a Comment

0 Comments